పది కోట్ల స్ట్రీమింగ్స్.... 'సామజ వర గమన', 'రాములో రాములా' పాటలు ఆన్ లైన్ లో వీరవిహారం
- బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అల... వైకుంఠపురములో
- ఆన్ లైన్ లో రిలీజైన రెండు పాటలు
- ఆడియన్స్ నుంచి విశేష స్పందన
ఈ రెండు పాటలు యూట్యూబ్, జియో సావన్ మ్యూజిక్ యాప్ లో 10 కోట్లకు పైగా స్ట్రీమింగ్స్ సొంతం చేసుకున్నాయి. 'రాములో రాములా' పాట యూట్యూబ్ లో 2.2 కోట్ల మంది చూడగా, 'సామజ వర గమన' పాటను 6.3 కోట్ల మంది వీక్షించారు. జియో అఫిషియల్ మ్యూజిక్ యాప్ జియో సావన్ లోనూ ఈ రెండు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.