RTC: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మరో ఆర్టీసీ డ్రైవర్

  • నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన
  • పురుగుల మందు తాగిన డ్రైవర్ మహ్మద్ ఖాజా
  • మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలింపు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతుండడంతో, తమ భవిష్యత్తు ఏమవుతుందో అని సంస్థ కార్మికులు పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో డ్రైవర్ మహ్మద్ ఖాజా (37) బలవన్మరణానికి యత్నించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

RTC
Driver
Suicide Attempt
Telangana
  • Loading...

More Telugu News