Kareena Kapoor: కరీనా కపూర్ కు అరుదైన అవకాశం కల్పించిన ఐసీసీ

  • మెల్బోర్న్ లో ఐసీసీ కార్యక్రమం
  • టి20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనా
  • ఐసీసీ ఈవెంట్ లో పాల్గొనడం పట్ల హర్షం

బాలీవుడ్ తార కరీనా కపూర్ కు ఐసీసీ నుంచి విశిష్ట గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తుండగా, పురుషుల, మహిళల టైటిళ్లను ఆవిష్కరించే భాగ్యం కరీనాకు లభించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరీనా పురుషుల, మహిళల టి20 వరల్డ్ కప్పులను ఆవిష్కరించారు. దీని గురించి కరీనా మాట్లాడుతూ, తనకు ఐసీసీ ఈ అవకాశం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

తన మామయ్య మన్సూర్ అలీఖాన్ పటౌడీ కూడా క్రికెటరే అని తెలిపిన కరీనా, టి20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించడం తనకు గర్వకారణమని పేర్కొంది. పలు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్లను అభినందిస్తున్నానని, అంతర్జాతీయ వేదికలపై మహిళలను సమున్నతస్థాయిలో చూడడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.

Kareena Kapoor
ICC
Australia
T20 Wolrdcup
  • Loading...

More Telugu News