Virat Kohli: కోహ్లీ లేనంత మాత్రాన టీమిండియా బలహీనంగా ఉందని భావించట్లేదు: బంగ్లాదేశ్ క్రికెటర్ లిటాన్ దాస్

  • టీ20 సిరీస్‌కు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి 
  • టీమిండియాలో సమర్థవంతమైన క్రికెటర్లు ఉన్నారన్న లిటాన్
  • తమ జట్టులో అనుభవమున్న  క్రికెటర్లు సిరీస్ కు దూరమయ్యారని వ్యాఖ్య

టీమిండియాలో కోహ్లీ ఉన్నాడా? లేడా? అన్న విషయం తమకు సమస్యే కాదని బంగ్లాదేశ్‌ క్రికెటర్ లిటాన్‌ దాస్‌ అన్నాడు. త్వరలో ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.

దీనిపై లిటాన్ దాస్ మాట్లాడుతూ.. టీమిండియాలో కోహ్లీ లేనంత మాత్రాన ఆ టీమ్ బలహీనంగా ఉందని తాను భావించట్లేదని చెప్పాడు. టీమిండియాలో చాలామంది సమర్థవంతమైన క్రికెటర్లు ఉన్నారని లిటాన్ దాస్ అన్నాడు. టీమిండియాలో ప్రతి క్రికెటర్ కి ప్రతిభ ఉందని తెలిపాడు. తమ జట్టులో మాత్రం అనుభవం ఉన్న క్రికెటర్లు ఈ సిరీస్ లో ఆడట్లేదని, అయినప్పటికీ సాధ్యమైనంతవరకూ మంచి ప్రదర్శన ఇస్తామని చెప్పాడు.

 కాగా, ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో జగరనున్న మ్యాచ్ తో టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు.

Virat Kohli
Bangladesh
Cricket
  • Loading...

More Telugu News