Chandrababu: మీ కృషి ఎనలేనిది: చంద్రబాబు

  • నేడు వీవీఎస్ లక్ష్మణ్ జన్మదినం
  • శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారంటూ ప్రశంస

టీమిండియా మాజీ ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పుట్టినరోజు నేడు. ఈ రోజు ఆయన 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 'తన అద్భుతమైన ఆటతీరుతో భారత క్రికెట్ రంగానికి ఎనలేని సేవలందించి, క్రికెట్ అభిమానుల చేత వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ గా పిలిపించుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన వీవీఎస్ లక్ష్మణ్ కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
VVS Laxman
Telugudesam
  • Loading...

More Telugu News