tsrtc: వరంగల్‌లో ఆర్టీసీ కండక్టర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • సమ్మెపై వస్తున్న కథనాలు చూస్తూ కుప్పకూలిన కండక్టర్
  • పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలింపు

సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కార్మికుల ముఖ్య డిమాండ్ అయిన ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీలో ప్రసారమవుతున్న కథనాలు చూస్తూ హన్మకొండలో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

tsrtc
Telangana
conductor
heartatack
  • Loading...

More Telugu News