Sujana Chowdary: రెండ్రోజులుగా వంశీ నన్ను కలవలేదు: సుజనా చౌదరి

  • వంశీ అంతకుముందోసారి కలిశారన్న సుజనా
  • తాము రాజకీయాలు మాట్లాడలేదని వెల్లడి
  • వైసీపీ సర్కారుపై విమర్శలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ వ్యవహారంపై స్పందించారు. వంశీ ఇటీవల ఓసారి తనతో మాట్లాడాడని, రెండ్రోజులుగా తనను కలవలేదని స్పష్టం చేశారు. తామిద్దరం కలిసినప్పుడు రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని సుజనా స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఏపీ సర్కారుపైనా సుజనా విమర్శలు చేశారు. ఎన్నికల మూడ్ నుంచి పరిపాలన మూడ్ లోకి వైసీపీ ఇంకా వచ్చినట్టు లేదని అన్నారు. ఎంతసేపూ బంధుప్రీతికి ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ వాళ్లకు ఏంచేయాలన్న దానిపైనే వాళ్ల దృష్టి ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ వాళ్లు ఒకరికంటే మరొకరు దారుణంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

Sujana Chowdary
BJP
Telugudesam
Vallabhaneni Vamsi
Jagan
YSRCP
  • Loading...

More Telugu News