Budda Venkanna: మీ తింగరి మాలోకాన్ని నిద్రలేపండి విజయసాయి గారూ!: బుద్ధా వెంకన్న

  • బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు
  • జగన్ పై ఘాటు వ్యాఖ్యలు
  • తింగరి మాలోకం అంటూ విమర్శలు

టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి ట్విట్టర్ లో పదునైన విమర్శలు చేశారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా వ్యాఖ్యానించారు. 'ఓవైపు రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రరూపు దాల్చితే, ఇంట్లో వీడియో గేమ్స ఆడుకుంటూ, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ నిద్రపోతున్న మీ తింగరి మాలోకం వైఎస్ జగన్ ను నిద్రలేపండి విజయసాయిరెడ్డి గారూ' అంటూ వెంకన్న ట్వీట్ చేశారు.

'జగన్ ను నిద్రలేపి ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తు చెయ్యండి విజయసాయి గారూ' అంటూ హితవు పలికారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూ రూ.1300 కోట్లతో శ్మశానాలకు కూడా రంగులు వేసుకుంటున్న వాళ్లను ఏమనాలి? అంటూ మండిపడ్డారు. ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నవాళ్లను తింగరి మాలోకం అనక మరింకేమని పిలవాలి? అంటూ ప్రశ్నించారు.

"దొంగ దీక్షలు చేయడంలో మీ తింగరి మాలోకం వైఎస్ జగన్ కు పీహెచ్ డీ వచ్చిన విషయం అందరికీ తెలుసు. ప్రత్యేక బస్సులో దొంగ మేతలో, సొంత డబ్బాలో గ్రాఫిక్స్ మనుషులు ఇవన్నీ ప్రజలకు తెలిసిన నిజాలే. ఇక పాదయాత్ర గురించి చెప్పాలంటే అదో భరించరానంత అద్భుతం! రోజుకు 3 కిలోమీటర్లు నడవడం, వారానికి రెండు రోజులు లోటస్ పాండ్ లో కేసుల పేరుతో విలాసం, ఎవరికి తెలియదు మీరు దొంగ దీక్షలకు పేటెంట్ అన్న సంగతి?" అంటూ వ్యంగ్యం కురిపించారు. ఇసుక కొరతపై నారా లోకేశ్ చేపట్టిన దీక్షపై వైసీపీ నేతలు విమర్శలు చేసిన నేపథ్యంలో బుద్ధా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Budda Venkanna
Jagan
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News