Srinivasa goud: మా పథకాలతో పాలమూరు పైపైకి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ఐటీ కారిడార్ ఏర్పాటుతో భావి తరాలకు బంగారు భవిష్యత్తు
- పాలమూరును దశల వారీగా అభివృద్ధి చేస్తాం
- పాలమూరు వైపు పారిశ్రామిక వేత్తల దృష్టిని మరలుస్తాం
తెలంగాణ ఆవిర్భావంతోనే పాలమూరులో అభివృద్ధి ఊపందుకుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు నుంచి వలసలను నిరోధించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈరోజు మంత్రి మహబూబ్ నగర్ జిల్లా, ఎదిర వద్ద ఐటీ పార్కు నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఐటీ కారిడార్ ఏర్పాటుతో జిల్లా నుంచి వలసలు ఆగిపోతాయని, భావి తరాలు, బంగారు భవిష్యత్తును అందుకుంటాయన్నారు. హైటెక్ సిటీ నమూనాలో భవనం నిర్మిస్తామని దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాలమూరు వైపు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి కృషిచేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలతో పాలమూరు ముందుకు దూసుకుపోతోందని చెప్పారు.
గత పాలకుల వల్ల పాలమూరు వెనకబడ్డదని, పాలమూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. కొంతమంది కోర్టు కేసులతో ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు..