Pawan Kalyan: కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికుల కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తా: పవన్ కల్యాణ్

  • రెండ్రోజుల్లో కేసీఆర్ తో మాట్లాడతానని పవన్ వెల్లడి
  • కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమని వ్యాఖ్యలు
  • పవన్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ ను బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరగా, పవన్ సానుకూల ధోరణి ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan
KCR
Telangana
TSRTC
Jana Sena
  • Loading...

More Telugu News