Chandrababu: ఆయన ప్రసంగాలు ఎంతో శక్తిమంతం.... గురుదాస్ దాస్ గుప్తా మృతిపై చంద్రబాబు స్పందన

  • వామపక్ష నేత గురుదాస్ దాస్ గుప్తా కన్నుమూత
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • దాస్ గుప్తా మృతికి సంతాపం

సీపీఐ అగ్రనేత గురుదాస్ దాస్ గుప్తా మరణవార్త తనను తీవ్ర విచారానికి గురిచేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వామపక్ష నేతగానే కాకుండా, కార్మిక సంఘాల నేతగా కూడా ప్రత్యేకస్థానం సంపాదించుకున్న దాస్ గుప్తా ప్రసంగాలు ఎంతో శక్తిమంతంగా ఉండేవని కొనియాడారు. ట్రేడ్ యూనియన్లను బలోపేతం చేయడంలోనూ, యూనియన్ సభ్యుల హక్కుల సాధనలోనూ ఆయనకు ఆయనే సాటి అని కీర్తించారు. ఈ విషాద సమయంలో దాస్ గుప్తా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
Gurudas Dasgupta
CPI
  • Loading...

More Telugu News