Hyderabad: హయత్ నగర్ లో రజిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

  • ప్రియుడు శశికుమార్ తో కలిసి తల్లి రజితను కుమార్తే హత్య చేసినట్లు నిర్ధారణ
  • కీర్తి, శశికుమార్ లను అరెస్టు చేసిన పోలీసులు
  • కాసేపట్లో మీడియా ముందు వారిని ప్రవేశపెట్టనున్న సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో చోటు చేసుకున్న 'రజిత హత్య' కేసును పోలీసులు ఛేదించారు. మునగనూరులో ప్రియుడితో కలిసి తన తల్లి రజితను కీర్తి అనే యువతి దారుణంగా హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ప్రియుడు శశికుమార్ తో కలిసి తల్లి రజితను కుమార్తే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కీర్తి, శశికుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి, అన్ని వివరాలను సేకరించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని వివరాలను కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

Hyderabad
Ranga Reddy District
Crime News
  • Loading...

More Telugu News