Sai Dharam Tej: 'టిక్ టాక్'కి ఎడిక్ట్ అయిన పాత్రలో నవ్వించనున్న రాశి ఖన్నా

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో 'ప్రతిరోజూ పండగే'
  • కీలకమైన పాత్రలో సత్యరాజ్ 
  • డిసెంబర్ 20వ తేదీన విడుదల

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా, 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో బంధాలు - అనుబంధాలు ప్రధానంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇందులో రాశిఖన్నా పాత్ర కడుపుబ్బ నవ్విస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

'టిక్ టాక్'కి బానిసైన ఆమె ఎప్పుడు చూసినా వీడియోలు చేస్తూ వుంటుందట. అలా ఆమె చేసే 'టిక్ టాక్' వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయని అంటున్నారు. 'సుప్రీమ్' సినిమాలో బెల్లంకొండ శ్రీదేవిగా కామెడీని పండించిన రాశి ఖన్నా, ఆ తరువాత చేస్తున్న హాస్యభరిత పాత్ర ఇదేనని చెబుతున్నారు. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.

Sai Dharam Tej
Rasi Khanna
  • Loading...

More Telugu News