assam: గ్రామం మీద పడి.. ఐదుగురిని తొక్కి చంపిన ఏనుగులు!

  • అసోంలోని గోల్పారా జిల్లాలో ఘటన
  • గ్రామంపై దండెత్తిన ఏనుగులు
  • మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు

అసోంలోని గోల్పారా జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓ గ్రామంపై దండెత్తిన ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని పరుగులు పెట్టించాయి. జనం వెంటపడి దాడిచేశాయి. వాటి దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఓ బాలుడు సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. ‘లాడెన్’ అనే ఏనుగు ఇటీవలి కాలంలో ఇలా గ్రామాలపై పడి హడలెత్తిస్తోంది. దాని బారినపడి ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఏనుగులను అడవిలోకి తరిమికొట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

assam
elephant
forest
  • Loading...

More Telugu News