Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అర్ధరాత్రి వరకు టీడీపీ నేతల చర్చలు

  • కేశినేని ఇంట్లో మూడున్నర గంటలపాటు జరిగిన చర్చలు
  • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనని స్పష్టీకరణ
  • టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందన్న నేతలు

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు పురమాయించిన కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు కొనసాగాయి.

ఈ సందర్భంగా వల్లభనేని మాట్లాడుతూ.. తనపైనా, తన అనుచరులపైనా నమోదవుతున్న అక్రమ కేసుల విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశారు.

ఆయన మాటలకు టీడీపీ నేతలు బదులిస్తూ.. టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉన్న ఇబ్బందుల విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి భరోసా విన్న వల్లభనేని మాట్లాడుతూ.. తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు చెప్పారు. వల్లభనేనితో చర్చల వివరాలను కొనకళ్ల, కేశినేని నానిలు చంద్రబాబుకు వివరించారు.

Vallabhaneni Vamsi
Kesineni Nani
konakalla narayana
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News