pavan kalyan: విశాఖ ర్యాలీకి మద్దతు ఇవ్వండి.. చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్

  • 15 నిమిషాలపాటు మాట్లాడుకున్న నేతలు
  • ఇసుక సమస్యపై చర్చ
  • బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందన్న పవన్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై అంతకుముందు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి ర్యాలీకి మద్దుతు కోరారు.

కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇసుక సమస్య విషయంలో బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా వుందని పవన్ చెప్పినట్టు సమాచారం. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పవన్ విజ్ఞప్తికి బాబు సానుకూలంగా స్పందించారని సమాచారం.

pavan kalyan
Chandrababu
Visakhapatnam
Andhra Pradesh
  • Loading...

More Telugu News