Kesineni Nani: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం భేష్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు

  • కొత్త చర్చకు తెరలేపిన ఎంపీ ప్రశంసలు
  • కేశినేని వ్యాఖ్యలపై అభినందనలు తెలిపిన మంత్రి
  • రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేయడంపై ప్రశంసలు

ఆర్టీసీ విలీనం విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఎంపీ కేశినేని నాని కల్పించిన వసతి సౌకర్యాలను రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం శుభపరిణామమని అన్నారు.

కేశినేని వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడాన్ని అభినందించారు. రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేసిన ఎంపీపై మంత్రి ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ విలీనంపై చంద్రబాబు మౌనం వహిస్తుంటే ఆ పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.  

Kesineni Nani
perni nani
apsrtc
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News