Nara Lokesh: లోకేశ్ ఇసుక దీక్ష అందుకోసమేనట.. వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి సెటైర్లు

  • డైటింగ్ కోసమే లోకేశ్ దీక్ష
  • ఐదేళ్లలో అందిన కాడికి దండుకున్నారు
  • వరదల వల్లే ఇసుక కొరత

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన దీక్షపై వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుకను అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక కొరతకు వరదలే కారణమని పేర్కొన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే మాటల్ని పట్టించుకోవద్దని, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్న శ్రీకాంత్‌రెడ్డి.. ఇసుక పంపిణీపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ లోకేశ్ చేపట్టిన దీక్షను ఎద్దేవా చేశారు. ఆయన దీక్ష ఇసుక కోసం కాదని, డైటింగ్ కోసమేనని అన్నారు. టీడీపీ చేసిన మోసాలు తెలిస్తే భవన నిర్మాణ కార్మికులు వారిని తరిమి కొడతారని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.

Nara Lokesh
Andhra Pradesh
sand
srikanth reddy
  • Loading...

More Telugu News