G.vivek: వాడుకుని వదిలేయడం కేసీఆర్‌కు అలవాటే: నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ వివేక్

  • అబద్ధాలు చెప్పడం కేసీఆర్‌కు అలవాటైన విద్యే
  • కార్మికులకు రూ.50 వేల జీతం వస్తోందని అబద్ధాలు చెబుతున్నారు
  • ఆర్టీసీని కాపాడుతున్నది కార్మికులే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాడుకుని వదిలేయడం అన్నది అలవాటైన విద్యేనని మాజీ ఎంపీ వివేక్ తీవ్ర విమర్శలు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సకల జనభేరికి హాజరైన వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వాడుకుని వదిలేయడం, అబద్ధాలు చెప్పడం అలవాటేనని అన్నారు. కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులకు రూ. 50 వేల జీతం వస్తోందని కేసీఆర్ చెబుతున్నారని, వాస్తవంగా వారికి వస్తున్నది రూ.20 వేలేనని అన్నారు. ఆర్టీసీని కాపాడుతున్నది కార్మికులేనన్న వివేక్.. 26 రోజులుగా వారు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల ఐక్యతకు వివేక్ సలామ్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ పోరాటంలో కార్మికులది కీలక పాత్ర అని వివేక్ పేర్కొన్నారు.

G.vivek
KCR
tsrtc
sakala janbheri
  • Loading...

More Telugu News