Priya Varrier: ప్రియా వారియర్ తెలుగులో గట్టి ప్రయత్నాలే చేస్తోందట

  • ప్రియా వారియర్ కి తగ్గిన క్రేజ్ 
  •  ముఖం చాటేసిన అవకాశాలు 
  • తెలుగు పైనే ప్రత్యేక దృష్టి

'ఒరు ఆదార్ లవ్' మలయాళ సినిమా విడుదలకి ముందు ప్రియా వారియర్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలకి ముందే ఆమెకి తెలుగు నుంచి చాలా అవకాశాలు వెళ్లాయి. అయితే ఆ సినిమా సక్సెస్ రేంజ్ చూసుకుని అప్పుడు కమిట్ అవుదామనే ఉద్దేశంతో 'తరువాత చూద్దాం' అనేసింది. ఆ సినిమా మలయాళంతో పాటు ఇతర భాషల్లోను పెద్దగా ఆడలేదు. దాంతో మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోను ఆమెకి అవకాశాలు ముఖం చాటేశాయి.

అయితే ప్రియా వారియర్ మాత్రం, తెలుగులో సక్సెస్ కావాలనే గట్టి పట్టుదలతోనే ఉందట. అందువల్లనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ ప్రయత్నాలు చేస్తోందట. ఆ ప్రయత్నాలు ఫలించే ఆమెకి నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Priya Varrier
  • Loading...

More Telugu News