Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షం... జనజీవనం అస్తవ్యస్తం!

  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • మరో రెండు రోజులు ఇదే పరిస్థితి  
  • కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు.

రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.

Tamil Nadu
depressure
heavy rains
  • Loading...

More Telugu News