RRR Movie: అనుకున్న విధంగా సీన్స్ రాలేదని.. రీషూట్ చేయాలనుకుంటున్న రాజమౌళి?

  • రషెస్ చూసి నిరాశకు గురైన రాజమౌళి
  • కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని నిర్ణయం
  • ఇప్పటికే దీనిపై నిర్మాతతో చర్చ

దసరా, దీపావళి సందర్భంగా అన్ని సినిమాల అప్ డేట్స్ బయటకు వచ్చాయి. కానీ తారక్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' గురించి మాత్రం అప్ డేట్ వెలువడలేదు. ఇది తారక్, రామ్ చరణ్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. అయితే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రషెస్ ను చూసిన రాజమౌళి నిరాశకు గురయ్యారని, కొన్ని సీన్లు అనుకున్న విధంగా రాలేదని చెబుతున్నారు. దీంతో, ఆ సన్నివేశాలను మళ్లీ షూట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే చిత్ర నిర్మాతతో ఈ విషయంపై చర్చించారని సమాచారం.

RRR Movie
Tollywood
Rajamouli
Junior NTR
Ramcharan
  • Loading...

More Telugu News