Hyderabad: 'షీ టీమ్స్'కు 22 సార్లు కంప్లయింట్ ఇచ్చిన యువతి.. లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు!

  • ఇటీవల పెండింగ్ కేసులను పరిశీలించిన పోలీసులు
  • విషయాన్ని గమనించి విస్తుపోయిన అధికారులు
  • కన్నతండ్రిపైనా ఫిర్యాదు చేసిన యువతి

పోకిరీలకు బుద్ధి చెప్పి, వారి నుంచి అమ్మాయిలను, మహిళలను రక్షించేందుకు ఏర్పాటైన షీ టీమ్స్ కు ఓ యువతి నుంచి ఏకంగా 22 సార్లు ఫిర్యాదులు అందాయి. పెండింగ్ కేసులను పరిశీలిస్తున్న క్రమంలో హైదరాబాద్ షీ టీమ్స్ బృందం ఈ విషయాన్ని గమనించి విస్తుపోయింది. ఆమె తన తండ్రిపైనా ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీసులు మహిళల రక్షణకు కల్పించిన సౌకర్యాన్ని ఈమె దుర్వినియోగం చేస్తోందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. ఐదేళ్ల క్రితం సైఫాబాద్ లో మొదలైన ఈ యువతి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే వచ్చింది. వేర్వేరు కారణాలతో పోలీసులను ఆశ్రయించే ఆమె, వారిని జైలుకు పంపాలని ఫిర్యాదు చేస్తోంది. పోలీసులు ఇప్పుడు ఈమె ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News