Innova: ఔటర్ ఎక్కితే దూసుకెళ్లే ఇన్నోవా.. రూ. 76 వేల చలాన్లు పెండింగ్.. కట్టించిన పోలీసులు!

  • రోడ్డు పక్కన నో పార్కింగ్ లో ఇన్నోవా
  • పరిశీలిస్తే రూ. 76,425 విలువైన చలాన్లు పెండింగ్ లో
  • మీ సేవా కేంద్రంలో డబ్బు కట్టిన యజమాని

అది ఓ ఇన్నోవా వాహనం. తరచూ ఔటర్ రింగ్ రోడ్డులో పరిమితికి మించిన వేగంతో దూసుకెళుతూ ఉంటుంది. స్పీడ్ గన్ లకు దొరికిపోతుంది. దీనిపై ఎన్నో చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. నిన్న ఈ వాహనం ఈసీఐఎల్‌ చౌరస్తాలో నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపివుండగా, కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీసులు చూసి, వాహనం నంబర్ 'టీఎస్‌ 07 ఈబీ 1115' తమ చేతిలోని మెషీన్ లో నమోదు చేసి చూడగా, ఏకంగా రూ. 76,425 విలువైన చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టు కనిపించింది.

దీంతో డ్రైవర్ రాగానే, చలాన్ల గురించి చెప్పి, దాన్ని సీజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. దీంతో అతను ఇన్నోవా యజమాని శ్రీనివాస్ కు విషయం చెప్పగా, వచ్చి, మీసేవ కేంద్రంలో జరిమానా మొత్తం చెల్లించి కారును తీసుకెళ్లాడు. చలాన్లలో అత్యధికం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అతివేగంగా వెళ్లడం వల్ల పడ్డవేనని పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News