Boy: చదివేది 7వ తరగతి, చేసేది డేటా సైంటిస్ట్ జాబ్... రూ. 25 వేల వేతనం... హైదరాబాద్ బాలుడి ఘనత!

  • మూడు రోజులు పని, మూడు రోజులు చదువు
  • తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిష్ణాతుడైన శరత్
  • ప్రత్యేకంగా అభినందించిన సబితా ఇంద్రారెడ్డి

శరత్... వయసు 12 సంవత్సరాలు. చదివేది 7వ తరగతి. సాధారణంగా ఆ వయసు పిల్లలు స్కూలుకెళ్లడం, ఆడుకోవడం చేస్తుంటారు. కానీ శరత్ వేరు. ఏకంగా రూ. 25 వేల గౌరవ వేతనంతో డేటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. అతని చదువుకు ఆటంకం రాకుండా ఉండేందుకు మూడు రోజులు పని చేస్తూ, మూడు రోజులు చదువుకునేందుకు అతనికి ఉద్యోగం ఇచ్చిన మోంటైగ్నే సంస్థ అనుమతించింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజ్‌ కుమార్, ప్రియ దంపతులు క్యాప్‌ జెమినీ సంస్థలో పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ల్యాప్ టాప్ లను చూస్తూ పెరిగిన వారి తనయుడు శరత్, కోడింగ్, జావాలపై ఆసక్తిని పెంచుకోగా, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో శరత్ రాటుదేలాడు. ఇటీవల మాగ్నైట్ సంస్థలో గౌరవ వేతనంతో ఉద్యోగం లభించడంతో పాటు, చదువుకునేందుకు వెసులుబాటు కూడా లభించింది. ఇక శరత్ ప్రతిభను గురించి తెలుసుకున్న తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రత్యేకంగా పిలిపించుకుని, అభినందించారు.

Boy
Telangana
7th Class
Sabita Indrareddy
  • Loading...

More Telugu News