Donald Trump: మరోసారి కీలక ప్రకటన చేసిన ట్రంప్... ఐసిస్ కాబోయే నేతను కూడా హతమార్చినట్టు వెల్లడి

  • ఇటీవలే ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
  • బాగ్దాదీ వారసుడ్ని కూడా మట్టుబెట్టామంటూ ట్రంప్ ట్వీట్
  • ఉగ్రనేత పేరు వెల్లడించని ట్రంప్

ఇటీవలే ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీని హతమార్చినట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అలాంటిదే కీలక ప్రకటన చేశారు. ఐసిస్ కాబోయే అధినేతను కూడా తమ సైన్యం అంతమొందించిందని ప్రకటించారు. బాగ్దాదీ తర్వాత ఐసిస్ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి గురించి నిఘా వర్గాలు సమాచారం అందించాయని, అతడిని మంగళవారం జరిగిన ఓ ఆపరేషన్ లో అమెరికా బలగాలు చంపేశాయని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ఉగ్రనేత పేరును మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. అంతర్జాతీయ కథనాల ప్రకారం బాగ్దాదీ తర్వాత ఇరాక్ కు చెందిన అబ్దుల్లా ఖుర్దాష్ ఐసిస్ పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. తన తదనంతరం ఖుర్దాష్ కు ఐసిస్ నాయకత్వం అప్పగించాలని బాగ్దాదీ కొన్ని నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చారు.

Donald Trump
USA
Baghdadi
ISIS
  • Loading...

More Telugu News