President Of India: వేదిక దిగి మహిళా సెక్యూరిటీ గార్డుకు రాష్ట్రపతి పరామర్శ

  • మానవతను చాటుకున్న రాష్ట్రపతి 
  • నేషనల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డుల ప్రదానోత్సవంలో ఘటన
  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ శర్మ పరామర్శ

జాతీయ గీతాలాపన సమయంలో ఓ మహిళా సెక్యూరిటీ గార్డు అనారోగ్యంతో కళ్లు తిరిగి పడిపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ శర్మలు మానవీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఘటన చోసుకుంది.  జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వారు వేదిక దిగి సదరు మహిళ వద్దకు వచ్చి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మళ్లీ వారు వేదికపైకి చేరుకుని అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని కొనసాగించారు.



President Of India
Ram Nath Kovind
New Delhi
  • Loading...

More Telugu News