Vallabhaneni Vamsi: వంశీని బీజేపీలో చేరకుండా టీడీపీ, వైసీపీ అడ్డుకుంటున్నాయి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ
  • ఇంకా ఏ పార్టీలోనూ చేరని గన్నవరం ఎమ్మెల్యే
  • వంశీ వ్యవహారంపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

ఏపీలో వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్టు లేదు. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఈ గన్నవరం ఎమ్మెల్యే ఇంకా ఏ పార్టీలో చేరకపోవడంతో, ఆయన పయనం ఎటువైపన్నది ఆసక్తికరంగా మారింది.

 తాజాగా దీనిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రజాదరణ ఉన్న కీలక నేత వంశీని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జాతీయస్థాయిలోకి రావాల్సిందిగా ఆయనను కోరుతున్నామని అన్నారు. అయితే వంశీని బీజేపీలో చేరకుండా టీడీపీ, వైసీపీ అడ్డుకుంటున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ కారణంగానే వంశీ టీడీపీని వీడారని ఆయన వెల్లడించారు. ఇంకా చాలామంది నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలిపారు.

Vallabhaneni Vamsi
Telugudesam
Vishnu Vardhan Reddy
BJP
YSRCP
  • Loading...

More Telugu News