Hyderabad: హైదరాబాద్ ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం

  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ట్రాఫిక్ కు ఇబ్బందులు
  • పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు 

శీతాకాలం ఆరంభమైనా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడడంలేదు. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైనా, ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, అమీర్ పేట, బేగంపేట, నేరేడ్ మెట్, మల్కాజ్ గిరి, పంజాగుట్ట, వనస్థలిపురం, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజ్ లు సైతం పొంగిపొర్లుతున్నాయి.

Hyderabad
Rain
Telangana
  • Loading...

More Telugu News