Keerthi Suresh: కీర్తి సురేశ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనట

  • కీర్తి సురేశ్ చేతిలో మూడు సినిమాలు 
  •  అన్నీ నాయిక ప్రాధాన్యత కలిగిన కథలే
  • నాగేశ్ దర్శకత్వంలో రైఫిల్ షూటర్ గా కీర్తి సురేశ్

 తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అల్లరి పిల్ల పాత్రలను చేస్తూ వచ్చిన కీర్తి సురేశ్, 'మహానటి'తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను ఆమె ఎంచుకుంటూ వస్తోంది. తమిళంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పెంగ్విన్'మూవీ చేస్తున్న ఆమె, తెలుగులో రెండు సినిమాలతో బిజీగా వుంది.

నరేంద్రనాథ్ దర్శకత్వంలో 'మిస్ ఇండియా' చేస్తున్న ఆమె, నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్ గా కనిపించనుంది. ఈ సినిమాకి 'గుడ్ లక్ సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. కీర్తి సురేశ్ కి కోచ్ పాత్రను జగపతిబాబు పోషిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో చివరి షెడ్యూల్ కి వెళ్లనుంది.

Keerthi Suresh
Jagapathi Babu
  • Loading...

More Telugu News