Kamal: 'భారతీయుడు 2' కోసం రంగంలోకి అజయ్ దేవగణ్

  • షూటింగు దశలో 'భారతీయుడు 2'
  •  ప్రతినాయక పాత్రలో అజయ్ దేవగణ్ 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు

కమల్ రాజకీయ పరమైన కారణాల వలన కొంచెం ఆలస్యంగా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టుకున్న 'భారతీయుడు 2' .. ప్రస్తుతం చకచకా షూటింగును జరుపుకుంటోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అజయ్ దేవగణ్ కనిపించనున్నాడు. వచ్చే షెడ్యూల్ నుంచి షూటింగులో ఆయన పాల్గొననున్నాడు.

అజయ్ దేవగణ్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇదే షెడ్యూల్లో ప్రియాంక అరుళ్ మోహన్ కూడా పాల్గొననుంది. కమల్ సరసన నాయికగా కాజల్ నటిస్తుండగా, రకుల్ .. ప్రియా భవాని .. సిద్ధార్థ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధురాలి లుక్ లోను కాజల్ కాసేపు కనిపించనుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను, వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.

Kamal
Kajal
Ajay Devgan
  • Loading...

More Telugu News