Lung cancer: ఊపిరితిత్తుల కేన్సర్‌ రాకుండా సులభంగా ఇలా చెక్ పెట్టొచ్చట!

  • వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిపై పరిశోధన
  • ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు తీసుకున్న వారిలో తగ్గిన ముప్పు
  • గట్ బ్యాక్టీరియా సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయని వెల్లడి

ఊపిరితిత్తుల కేన్సర్‌కు చెక్‌పెట్టే సులభమైన మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పీచు పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకున్న వారికి ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం బహు స్వల్పమని అమెరికాలోని వేండర్‌బిల్ట్‌ -ఇన్‌గ్రామ్‌ కేన్సర్‌ కేంద్రం శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

పరిశోధనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిని శాస్త్రవేత్తలు ఐదు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల కేన్సర్ రిస్క్ 33 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిలోని పోషక విలువలు జీర్ణాశయంలోని పేగుల్లో ఉండే గట్‌ బ్యాక్టీరియా సామర్థ్యాన్ని పెంచి కేన్సర్ రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనంలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News