KCR: కేసీఆర్ అలాంటివాడు కాదు... మనసులో ఉన్న భక్తిని దాచుకోడు: చినజీయర్ స్వామి

  • నేతలు దేవుడి గురించి మాట్లాడేందుకు జంకుతారన్న చినజీయర్
  • కేసీఆర్ అందుకు వ్యతిరేకమని వెల్లడి
  • మనసులో ఉన్న భక్తిని బయటకు చెప్పగల ధైర్యవంతుడని కితాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో 'తిరునక్షత్ర మహోత్సవం' వేడుకల్లో భాగంగా ఈ సాయంత్రం కేసీఆర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి మాట్లాడుతూ చినజీయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్లు భగవంతుడి గురించి మాట్లాడేందుకు భయపడతారని, కానీ కేసీఆర్ అలాంటి వాడు కాదని, దేవుడిపై అచంచల భక్తివిశ్వాసాలు కలిగివుండడమే కాదు, వాటిని నిర్భయంగా ప్రదర్శిస్తారని కొనియాడారు.  యాదాద్రి ఆలయ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషి శ్లాఘనీయం అని పేర్కొన్న చినజీయర్ స్వామి, బక్క పలుచని మనిషైనా కేసీఆర్ గొప్ప ధైర్యవంతుడని కితాబునిచ్చారు.

KCR
Chinnajeeyar Swami
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News