India: భారత పర్యటనకు రానున్న బ్రిటన్ యువరాజు
![](https://imgd.ap7am.com/thumbnail/tn-2464eef6befaa4ee01ca88bc8e52e40fc76c476b.jpeg)
- నవంబర్ 13, 14 తేదీల్లో పర్యటన
- 14న తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్న యువరాజు
- బ్రిటన్- భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం
బ్రిటన్ యువరాజు చార్లెస్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. నవంబరు 13న భారత్ వస్తున్నారు. ఆయన రాకతో బ్రిటన్- భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన మార్కెట్ల స్థిరీకరణ, వాతావరణ మార్పులు, సోషల్ ఫైనాన్స్ వంటి అంశాలపై ప్రముఖులతో చర్చించనున్నారు. సుదీర్ఘ కాలంగా బ్రిటీష్ యువరాజుగా కొనసాగుతున్న రికార్డు నమోదు చేసిన చార్లెస్ నవంబర్ 14న తన 71వ పుట్టిన రోజును భారత్ లో జరుపుకోనున్నారు. ఆయన ఇప్పటివరకు 9సార్లు భారత్ ను సందర్శించారు. 2017 నవంబర్ లో చివరిసారిగా ఆయన భార్య కెమిల్లాతో కలిసి భారత్ ను సందర్శించారు.