Pawan Kalyan: కార్మికుల సమస్యలపై పోరుకు మిగతా పార్టీల సహకారం కోరిన పవన్ కల్యాణ్

  • రాజకీయ పార్టీలు కలిసిరావాలన్న జనసేనాని
  • నవంబర్ 3న చేపట్టనున్న నిరసనకు తరలిరావాలని పిలుపు
  • కార్మికుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయంటూ ఆవేదన

ఏపీలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు తనను కలచివేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో వారు పనిలేక ఆకలి బాధలకు గురవుతున్నారని తెలిపారు. నెలల తరబడి పనిలేక కష్టాలకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాజకీయ పార్టీలు తమతో కలిసి రావాలని, పార్టీలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 3న విశాఖపట్టణంలో చేపట్టనున్న నిరసనలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. బీజేపీ, వామపక్షాలు భవన నిర్మాణ కార్మికుల సమస్యపై ఇప్పటికే స్పందించాయన్నారు.

Pawan Kalyan
Jana Sena
Telugudesam
BJP
Vizag
  • Loading...

More Telugu News