Ravindra Jadeja: టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరో చెప్పిన కోచ్!

  • గత పదేళ్లలో జడేజా వంటి ఫీల్డర్ రాలేదన్న ఫీల్డింగ్ కోచ్
  • అతని పీల్డింగ్ లో ఎలాంటి వైఫల్యాలుండవని కితాబు
  • అద్భుత క్యాచ్ లు పట్టడంలో తనకుతానే సాటి అని ప్రశంస

భారత జట్టులో రవీంద్ర జడేజా వంటి ఫీల్డర్ ను గత పదేళ్ల కాలంలో చూడలేదని ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అన్నారు. ఇటీవల కోచింగ్ స్టాఫ్ విభాగంలో శ్రీధర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్న దానిపై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"రవీంద్ర జడేజా టీమిండియాలో తనకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అతను ఆల్ రౌండర్, బ్యాట్స్ మన్, బౌలర్ గానే కాకుండా ఫీల్డర్ గా అతడు తిరుగులేని ఆటను ప్రదర్శిస్తున్నాడు. మైదానంలో బంతిని నిలువరించడంతో పాటు, అసాధారణ క్యాచ్ లకు మారుపేరుగా నిలిచాడు. పదేళ్ల కాలంలో జడ్డూనే ఉత్తమ ఫీల్డర్. భారత్ కు దొరికిన అణిముత్యం అతడు!" అంటూ ప్రశంసించాడు.

Ravindra Jadeja
Team India
Cricket
Fielding
  • Loading...

More Telugu News