Telugudesam: టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరు: కేశినేని నాని

  • ఆయనను వదులుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా లేదు
  • ఆయన తరఫున పోరాడడానికి మేమంతా సిద్ధం
  • కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదు

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యవహారంపై టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరని, అలాగే ఆయనను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆయన తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదని సూచించారు.

వంశీతో మాట్లాడడానికి తాను ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. వంశీది టీడీపీ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. కాగా, వంశీతో మాట్లాడాలంటూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.

Telugudesam
YSRCP
Kesineni Nani
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News