Chandrababu: నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  • వంశీ అంకితభావం నేను మరువలేను
  • వంశీ పోరాటాలకు పార్టీ అండగా ఉంటుంది
  • సమస్యలను పరిష్కరించుకుందామన్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు.

వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.

Chandrababu
Vallabhaneni Vamsi
Letter
  • Loading...

More Telugu News