Roger Federer: కెరీర్ లో పదోసారి... స్విస్ చాంపియన్ షిప్ గెలిచిన రోజర్ ఫెదరర్!

  • 6-2, 6-2 తేడాతో విజయం
  • అలెక్స్ డి మినార్ పై ఫెదరర్ గెలుపు
  • కెరీర్ లో 103 సింగిల్స్ టైటిల్ సాధించిన స్విస్ స్టార్

తన టెన్నిస్ కెరీర్ లో స్విస్ ఇండోర్ చాంపియన్ షిప్ ను టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పదోసారి గెలుచుకున్నాడు. బాసెల్ లో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ పై 6-2, 6-2 తేడాతో ఫెదరర్ విజయం సాధించాడు. దీంతో కెరీర్ లో 103వ సింగిల్స్ టైటిల్ ను ఆయన గెలిచినట్లయింది.

ఈ సీజన్ లో ఇది ఫెదరర్ కు నాలుగో టైటిల్, దుబాయ్, మియామి, హాలే టైటిల్స్ ను ఇప్పటికే గెలుచుకున్న ఫెడ్, ఇప్పుడు స్విస్ పోటీల్లోనూ గెలిచాడు. ఆట ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఫెదరర్, ఆట తొందరగా పూర్తయినా, తాను ఉత్తమమైన ఆటతీరును కనబరిచాననే అనుకుంటున్నట్టు తెలిపాడు. అలెక్స్ ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడాడని, హోమ్ టౌన్ లో టైటిల్ గెలుచుకోవడం తనకెంతో ప్రత్యేకమైన విజయమని చెప్పుకొచ్చాడు.

Roger Federer
Swiss Indore Championship
Winner
  • Loading...

More Telugu News