Undavalli: జగన్ దగ్గర ఉండేందుకు నేను పనికిరాను: ఉండవల్లి

  • జగన్ సీఎం కావడం నాకెంతో సంతోషం
  • ఐదు నెలలకే జగన్ ను జడ్జ్ చేయడం సరికాదు
  • బీజేపీ హవా ఎల్లకాలమూ నిలవదు
  • బీజేపీ ఉన్నంత కాలం ప్రత్యేక హోదా అసాధ్యమన్న ఉండవల్లి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్ద ఉండేందుకుగానీ, ఆయనకు సలహాదారుగాగానీ తాను పనికిరానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన మిత్రుడు వైఎస్ కుమారుడైన జగన్, ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషకరమని అన్నారు. జగన్ పాలన మొదలై ఐదు నెలలు మాత్రమే అయిందని, ఇంత స్వల్ప కాలానికే ఓ వ్యక్తిని జడ్జ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోందని, అయితే, ఇది ఎల్లకాలమూ ఉండబోదని ఉండవల్లి అంచనా వేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు అత్యంత కఠిన రాజకీయ నాయకులని, తామనుకున్నది చేసుకుంటూ వెళ్లడమే తప్ప వారికి మరొకటి తెలియదని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ విషయమై దేశ ప్రజలను ఒప్పించగలిగారని, మరొకరికి ఈ పని సాధ్యమయ్యేది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బీజేపీ కేంద్రంలో ఉంటే అసాధ్యమని అన్నారు.

పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడిగా మారాడని, అయితే, ఆయన చంద్రబాబుకు దగ్గరగా ఉన్నారని ప్రజలు నమ్మడంతోనే గత ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు, సీట్లు దక్కలేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. తానిప్పుడు ఎవరి పక్షానా లేనని, వివిధ అంశాలపై మాత్రం స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News