Narendra Modi: సరిహద్దుల్లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ

  • జమ్మూకశ్మీర్ లోని రాజౌరి వెళ్లిన మోదీ
  • జవాన్లకు మిఠాయిలు పంచి ఉల్లాసంగా గడిపిన ప్రధాని
  • మోదీ రాకకు ముందు పాక్ కాల్పులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సరిహద్దుల్లో జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు జిల్లా రాజౌరి వెళ్లిన ఆయన అక్కడి సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో కనిపించిన మోదీ జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టారు. స్వయంగా ఆయన వారికి తినిపించారు. సైనికులతో ఉల్లాసంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సైనికాధికారులు ఉన్నారు. మోదీ రాజౌరి రాకకు కొద్ది ముందు పాకిస్థాన్ వైపు నుంచి సైనిక పోస్టులపై గుళ్ల వర్షం కురిసింది. ఈ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

Narendra Modi
Diwali
Jammu And Kashmir
  • Loading...

More Telugu News