Narendra Modi: మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్... మోదీ విమానానికి అనుమతి నిరాకరణ

  • సౌదీ అరేబియా వెళ్లనున్న మోదీ
  • పాక్ గగనతలం ఉపయోగించుకునేందుకు అభ్యర్థన
  • భారత విజ్ఞప్తిని తిరస్కరించిన పాక్

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్ పై విద్వేషంతో రగిలిపోతున్న పాకిస్థాన్ మరోసారి తన వైఖరి చాటుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి తమ గగనతలంపై నుంచే వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా పాక్ మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ వర్గాలు కోరగా, తాము భారత విజ్ఞప్తిని తిరస్కరించామని పాక్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన నేటికీ ఆగలేదని, అందుకే పాక్ గగనతలాన్ని మోదీ ఉపయోగించుకునేందుకు అనుమతించబోవడంలేదని పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోదీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్ కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.

Narendra Modi
India
Pakistan
Saudi Arabia
  • Loading...

More Telugu News