Kala Venkatrao: ఇంటి చుట్టూ రాళ్లు పాతి నిర్బంధిస్తారా?.. ఇలాంటివి వైసీపీ పాలనలో తప్ప ఎక్కడా చూడలేదు: కళా వెంకట్రావు

  • అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ రాళ్లు  
  • తీవ్రంగా నిరసించిన కళా వెంకట్రావు
  • వైసీపీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి

అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ వైసీపీ నేతలు రాళ్లు పాతి గృహ నిర్బంధం చేయడం దారుణమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీపావళి నాడు టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను ఎవరినీ బయటికి రానివ్వకుండా ఇళ్ల చుట్టూ రాళ్లు పాతడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటివి వైసీపీ పాలనలో తప్ప మరెక్కడా కనిపించవని ఘాటుగా విమర్శించారు. అనాగరిక చర్యలతో రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని కోరారు.

Kala Venkatrao
Telugudesam
YSRCP
Anantapur District
  • Loading...

More Telugu News