tik tok: రెండో భార్యతో టిక్ టాక్ వీడియో చేసి... మొదటి భార్యకు దొరికిపోయిన భర్త

  • విజయవాడకు చెందిన వి.టి.పి.ఎస్ ఉద్యోగి సత్యరాజు నిర్వాకం
  • టిక్‌టాక్ యాప్ ద్వారా పరిచయమైన మహిళను రెండో పెళ్లి
  • మొదటి భార్యను చంపేందుకు ప్రణాళిక

టిక్‌టాక్ యాప్ ద్వారా పరిచయమైన ఓ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. మొదటి భార్యకు ఈ విషయాన్ని చెప్పకుండా రహస్యంగా రెండో భార్యతో కాపురం పెట్టాడు. చివరకు అతడిని టిక్ టాక్ వీడియోనే పట్టించింది. రెండో భార్యతో అతడు టిక్‌ టాక్ వీడియో చేయడంతో అది మొదటి భార్య కంటపడింది. దీంతో అతడిలోని రెండో కోణం వెలుగులోకి వచ్చింది.

టిక్ టాక్ లో పరిచయమైన ఓ మహిళను విజయవాడకు చెందిన వి.టి.పి.ఎస్ ఉద్యోగి సత్యరాజు.. మొదటి భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు. టిక్ టాక్ ద్వారా ఈ విషయం బయటపడిందని గుర్తించిన సత్యరాజు... మొదటి భార్యను హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

tik tok
Vijayawada
Krishna District
  • Loading...

More Telugu News