borewell: రెండు రోజులుగా బోరు బావిలో చిన్నారి

  • తమిళనాడులో ఘటన
  • 90 అడుగుల లోతులో బాలుడు
  • సహాయక చర్యల్లో ఐఐటీ మద్రాస్ నిపుణులు

తమిళనాడులో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడ్డాడు. అతడిని బయటకు తీసేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలోని నాడుకట్టుపల్లిలో శుక్రవారం సుజిత్‌ విల్సన్‌ అందులో పడ్డాడు. తన ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పైపుల ద్వారా అతడికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. బోరుబావిలోని బాలుడు  90 అడుగులలోతులో ఉన్నాడు. ఆ బోరుబావి మొత్తం లోతు 600 అడుగులు ఉందని తెలిసింది. దానికి సమాంతరంగా గోతిని తవ్వి అతడిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులతో పాటు మరో 6 బృందాలు పాల్గొంటున్నాయి.

borewell
Tamilnadu
  • Loading...

More Telugu News