Donald Trump: భారీ సంఘటన జరిగిందని ట్విట్టర్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్

  • 'ఐసిస్' అగ్రనేత బాగ్దాదీ హతం
  • అంతర్జాతీయ మీడియాలో కథనాలు  
  • ట్రంప్ ఓ కీలక ప్రకటన చేస్తారన్న శ్వేతసౌధం

ప్రపంచానికి తీవ్ర ముప్పులా పరిణమించిన ఉగ్ర సంస్థ 'ఐసిస్' అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలోనూ ఇటువంటి కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, బాగ్దాదీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం. 'భారీ సంఘటన జరిగింది' అంటూ ఆయన స్పందించారు.

కాగా,  అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిందని కథనాలు వస్తున్నాయి. సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో అతడిని అమెరికా సైన్యం హతమార్చిందని రష్యా మీడియా పేర్కొంది. ఐసిస్ కు చెందిన అగ్రనేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో అతడు మృతి చెందాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక ప్రకటన చేస్తారని శ్వేత సౌధం పేర్కొంది. ఆయన దేనిపై ప్రకటన చేస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సిరియాలో ఈ ఆపరేషన్ జరపడం కోసం తమ సైన్యానికి వారం రోజుల క్రితం ట్రంప్ అనుమతి ఇచ్చారు. 

Donald Trump
america
isis
  • Loading...

More Telugu News