SCR: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక!

  • టపాసులు, బాణసంచా తీసుకెళ్లడం నేరం
  • చట్ట విరుద్ధ పనులు చేస్తే కేసులు నమోదు
  • ద.మ.రై సీపీఆర్వో రాకేశ్

ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా, ఈ దీపావళి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రయాణికులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్ధాలు తీసుకెళ్లరాదని, ముఖ్యంగా టపాసులు, బాణసంచా తీసుకుని వెళ్లడం చట్ట ప్రకారం నేరమని ద.మ.రై  సీపీఆర్వో సీహెచ్ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చట్ట వ్యతిరేకంగా టపాసులు తీసుకు వెళ్లే వారిపై రైల్వే చట్టం –1989లోని సెక్షన్‌ 164తో పాటు, 165 ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా టపాసులు, బాణా సంచా తీసుకెళ్తున్నట్లు అనుమానం వస్తే, పక్కనే ఉండే ప్రయాణికులు 182 నెంబర్‌ కు ఫోన్‌ చేసి చెప్పాలని అన్నారు.

  • Loading...

More Telugu News