Japan: ప్రదర్శనశాల నుంచి రూ.13 కోట్ల వజ్రాన్ని అలవోకగా కొట్టేశారు!

  • జపాన్‌లోని యోకోహామాలో ఆభరణాల ప్రదర్శన
  • పాల్గొన్న 410 ఆభరణాల సంస్థలు
  • 50 క్యారెట్ల వజ్రాన్ని కొట్టేసిన చోరులు

అది జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని యోకోహామా. అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి 410 ఆభరణాల సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఓ గాజు పేటికలో ఉంచిన 50 క్యారెట్ల వజ్రం కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతోంది. ఆ ప్రదర్శన మొత్తానికి అదే హైలెట్‌గా నిలిచింది. దాని ఖరీదు రూ.13 కోట్లు.

గురువారం సాయంత్రం 5 గంటల వరకు కనువిందు చేసిన ఈ వజ్రం ఆ తర్వాత కాసేపటికే మాయమైంది. దీంతో ప్రదర్శనశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటి వరకు కనిపించిన వజ్రం మాయం కావడం మిస్టరీగా మారింది. అత్యంత భద్రత ఉన్నా.. ఎలా మాయమైందో ఎవరికీ అంతుబట్టకుండా పోయింది. వజ్రం మాయమైన వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ఫక్కీలో మాయమైన ఈ వజ్రాన్ని కాజేసిన వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

Japan
tokyo
daimond
yokohama
theft
  • Loading...

More Telugu News