jayaprada: శ్రీ వేంకటేశ్వర భక్తిచానల్ డైరెక్టర్‌గా డాక్టర్ జయప్రద

  • తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా వేణుగాన విద్వాంసురాలు
  • జాతీయ స్థాయిలో పలు అవార్డులు
  • తనకు దీపావళి ముందే వచ్చిందన్న జయప్రద

శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) బోర్డు డైరెక్టర్‌గా ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్‌ జయప్రద రామమూర్తి నియమితులయ్యారు.  తెలుగు రాష్ట్రాల్లో వేణుగాన విద్వాంసురాలైన తొలి మహిళగా సుప్రసిద్ధులైన డాక్టర్‌ జయప్రద.. తన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కళాకారిణిగా ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. వేంకటేశుని సేవకు ఇది మంచి అవకాశమన్నారు. దీపావళికి ముందే తనకు పండుగ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న డాక్టర్ జయప్రద అంతర్జాతీయ స్థాయిలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వంటి వారితో కలిసి పలు ప్రాజెక్టులు చేశారు.

jayaprada
svbc
Tirumala
director
  • Loading...

More Telugu News