Nalini: విడుదల చేయాలంటూ జైల్లోనే నిరహార దీక్షకు దిగిన నళిని
- 28 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నానంటూ లేఖ
- ఇదే కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న నళిని భర్త మురుగన్
- శుక్రవారం నుంచి ఆహారం తీసుకోకుండా నిరసన
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి తమిళనాడులోని వేలూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తనను విడుదల చేయాలంటూ నిరసనకు దిగింది. శుక్రవారం రాత్రి నుంచి ఆహారం తీసుకోకుండా తన డిమాండ్ ను నెరవేర్చాలని కోరుతోంది. తాను, తన భర్త మురుగన్ 28 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నామని.. తమను విడుదల చేయాలంటూ జైలు అధికారులకు లేఖ రాసింది.
ఇటీవల కుమార్తె వివాహంకోసం కొన్ని రోజులపాటు పెరోల్ పై నళిని బయటకు వచ్చింది. ఇప్పుడు తన మామ ఆరోగ్యం క్షీణించిందని మరో నెలరోజులు పెరోల్ కావాలని కోరింది. రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. గవర్నర్ ఈ సిఫారసుపై స్పందించలేదు.